అడివి శేష్ హీరోగా నటించిన ప్రయోగాత్మక సినిమా ‘కర్మ’తో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పరిచయం అయింది కెనడాలో పెరిగిన బెంగాలీ బ్యూటీ ప్రియా బెనర్జీ. ఆ తర్వాత సందీప్ కిషన్ ‘జోరు’ సినిమాలో రాశి ఖన్నా, సుష్మా రాజ్ లతో పాటు మెరిసింది. తెలుగులో ఆమె నటించిన రెండు సినిమాలు ప్లాప్ అయినప్పటి, హిందీలో పెద్ద అవకాశం సొంతం చేసుకుంది. ఐశ్వర్యా రాయ్ కం బ్యాక్ ఫిల్మ్, సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ‘జబ్బా’లో అవకాశం సొంతం చేసుకుంది.
విచిత్రంగా ప్రియా బెనర్జీకి ఈ సినిమాలో అవకాశం లభించింది. ఎవరో ఒక వ్యక్తి ప్రియా బెనర్జీ వీడియోను ట్విట్టర్ లో దర్శకుడు సంజయ్ గుప్తాకు టాగ్ చేశారు. ఆ వీడియో క్లిప్పింగ్ చూసిన సంజయ్, తన సినిమాలో ముఖ్యమైన పాత్రకు ప్రియ పర్ఫెక్ట్ ఛాయస్ అని భావించాడు. వెంటనే, ఆడిషన్స్ నిర్వహించడం, ప్రియా బెనర్జీ సెలెక్ట్ కావడం జరిగాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుంది.


