విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం – ప్రియా వారియర్

Published on Aug 8, 2019 9:31 pm IST

సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మొదటి చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’, ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులో విడుదల అయినా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఈ సినిమాకి ముందు ఆమెకు కొన్ని ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో వచ్చినా ఆఫర్లు కాస్త పోయాయి. మొత్తానికి ఎట్టకేలకూ నితిన్ సినిమాలో ఆమెకు రెండో కథానాయకిగా ఛాన్స్ దొరికింది.

కాగా తాజాగా ఈ హీరోయిన్… నువ్వంటే నాకిష్టం అని ఓ హీరో గురించి పోస్ట్ చేసింది. విషయంలోకి వెళ్తే.. ప్రియా వారియర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో తెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని పోస్ట్ చేసింది. మరి విజయ్ దేవరకొండతో సినిమా చెయ్యబోతుందా.. ? లేక ఎప్పుడో దిగిన ఫోటోను ఇప్పుడు పోస్ట్ చేస్తూ విజయ్ మీద అభిమానాన్ని ఇలా తెలిపిందా అనేది తెలియాలి. మొత్తానికి ప్రియా వారియర్ పెట్టిన ఈ పోస్ట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :