‘బద్మాషులు’ నుండి ప్రియదర్శి లాంచ్ చేసిన ‘జిందగీ జిలాలే’ సాంగ్

‘బద్మాషులు’ నుండి ప్రియదర్శి లాంచ్ చేసిన ‘జిందగీ జిలాలే’ సాంగ్

Published on May 23, 2025 10:00 PM IST

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి జిందగీ బిలాలే సాంగ్ ను హీరో ప్రియదర్శి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘బద్మాషులు సినిమా ప్రోమోషల్ సాంగ్ జిందగీ బిలాలే సాంగ్ విడుదల చేయడం జరిగింది. సాంగ్ చాలా ఎంటర్టైన్‌గా ఉంది. తేజ కూనూరు సంగీతం అందించారు. టీజర్ హిలెరియస్‌గా ఉంది. ఫన్ టేక్ ఓవర్ చేసినట్లు ఉంది. జూన్ 6న విడుదల కాబోతున్న బద్మాషులు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా రూరల్ రూటెడ్ కథ-కథనం, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ..డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ చాలా రిఫ్రెషింగ్ గా అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతోంది. జూన్ 6న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ థియేటర్స్ లో విడుదల చెయ్యబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు