రూమర్స్ ని కొట్టి పారేసిన ప్రియమణి

రూమర్స్ ని కొట్టి పారేసిన ప్రియమణి

Published on Jul 1, 2014 9:19 PM IST

Priyamani (1)
గతంలో దాదాపు టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన ప్రియమణి ప్రస్తుతం కన్నడ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా కన్నడ నటుడు కుమార్ గోవింద్ తో తనకు లింక్ ఉందన్న వార్తలు, దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా మీడియాలో కనిపించాయి.

ఈ వార్తలని ప్రియమణి కొట్టి పారేసింది. ‘ఓ మై గాడ్.. ఇద్దరు కలిసి ఓ ఫోటోకి పోజు ఇస్తే దాని అర్థం ఒకరిని ఒకరు చూసుకుంటున్నట్టు కాదు. మీడియా వాళ్ళు ఒక స్టొరీ రాసే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని రాయండి. అలాగే మిస్టరీ మాన్ అని కుడా అంటున్నారు. అది చాలా ఫన్నీగా ఉందని’ ప్రియమణి చెప్పింది.

అలాగే మాట్లాడుతూ ‘మీడియాకి, మిగతా వారికి అందరికీ మరోసారి క్లారిఫై చేస్తున్నాను. గోవింద్ పద్మసూర్య డి4డి షో నుంచి మంచి ఫ్రెండ్. అంతకన్నా ఏమీలేదని’ అన్నాడు.

తాజా వార్తలు