లాస్ ఏంజెల్స్ లో 144కోట్లతో ఇల్లు కొన్న హాట్ హీరోయిన్

Published on Nov 14, 2019 9:36 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 2017లో వచ్చిన బేవాచ్ అనే హాలీవుడ్ మూవీ తరువాత అమెరికాకే పరిమితమైంది. ఇదే సమయంలో తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ యాక్టర్ అయిన నిక్ జోనస్ తో ప్రేమలో పడింది. గత ఏడాది డిసెంబర్ లో వీరు పెళ్లి కూడా చేసుకున్నారు. కాగా ఈ సెలెబ్రిటీ కపుల్ అమెరికాలోనే అత్యంత విలాస నగరంగా భావించే లాస్ ఏంజెల్స్ లో కొత్త ఇంటిని కొన్నారట. ఐతే దాని ధర చూస్తేనే మన మతిపోతుంది. నిక్ ప్రియాంక ఆ ఇంటి కొరకు ఏకంగా $20మిలియన్ డాలర్స్ వెచ్చించారట. అనగా మన కరెన్సీలో దాదాపు 144కోట్ల రూపాయలన్న మాట.

ఇక ఆ విలాసవంతమైన ఇంటిలో మొత్తం7 పడక గదులు, 11 స్నానపు గదులు ఉంటాయట. ఇంత విలాసవంతమైన ఇంటిని దక్కించుకొని ఈ జంట మరోమారు వార్తలలో నిలిచారు. ఇక చాలా కాలం తరువాత ప్రియాంక ఈ ఏడాది ‘స్కై ఈస్ పింక్’ అనే హిందీ చిత్రంలో నటించారు. ఆమె నటిస్తున్న హాలీవుడ్ మూవీ ‘వి కెన్ బి హీరోస్’ చిత్రీకరణ జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం :