‘ఓజి’ భామ ప్రియాంక మోహన్‌కు అరుదైన గౌరవం..!

‘ఓజి’ భామ ప్రియాంక మోహన్‌కు అరుదైన గౌరవం..!

Published on Jun 2, 2026 1:03 AM IST

సౌత్ సినిమా క్రేజీ బ్యూటీ ప్రియాంక మోహన్ అంతర్జాతీయ స్థాయిలో ఒక అరుదైన గౌరవాన్ని అందుకుంది. కొరియా టూరిజం ఆర్గనైజేషన్ ఆమెను ‘కొరియా టూరిజం గౌరవ రాయబారి’గా నియమించింది. భారతదేశంలో, ముఖ్యంగా యువతలో కొరియన్ సంస్కృతి, పర్యాటక రంగంపై అవగాహన పెంచేందుకు గాను ఆమెను ఈ ప్రతిష్టాత్మక పదవికి ఎంపిక చేశారు.

ప్రస్తుతం భారత్‌లో కొరియన్ డ్రామాలు, పాప్ మ్యూజిక్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రియాంక ద్వారా కొరియా టూరిజాన్ని ప్రమోట్ చేయడం రెండు దేశాల సాంస్కృతిక బంధానికి మరింత దోహదపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ బాధ్యత దక్కడంపై ప్రియాంక కూడా హర్షం వ్యక్తం చేసింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక మోహన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నానితో ‘సరిపోదా శనివారం’, పవన్ కళ్యాణ్‌తో ‘ఓజి’ సినిమాల్లో నటించి టాలీవుడ్‌లోనూ మంచి విజయం అందుకుంది. కెరీర్ పరంగా దూసుకుపోతూనే, ఇలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంపై అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజా వార్తలు