ప్రియా ప్రకాష్ సినిమా తెలుగులోనూ విడుదలకానుంది !

Published on Dec 23, 2018 4:24 pm IST

మలయాళ బ్యూటీ, వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ ఏడాది సౌత్ నుండి గూగూల్ ట్రెండ్స్ లో టాప్ ప్లేస్ ను కైవసం చేసుకుంది. అత్యధికంగా గూగుల్ లో ఆమె గురించి అన్వేషించారంటే ఆమె కు దేశ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనసరం లేదు. దాంతో ప్రియా ప్రకాష్ నటిస్తున్న తాజా చిత్ర ‘ఒరు ఆధార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం మళయాళంతో పాటు తెలుగులో ప్రేమికుల రోజు సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదలకానుంది. సుఖీభవ సంస్థ ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులను సొంతం చేసుకుంది. ఒమర్ లులు తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :