లేడీ డైరెక్టర్, పీఆర్వో బి. ఏ. రాజు భార్య ‘బి. జయ’ మృతి!

Published on Aug 31, 2018 1:41 am IST


మన తెలుగు ఇండస్ట్రీలో మగ డైరెక్టర్లతో పాటు, లేడీ డైరెక్టర్లు కూడా ఉన్నప్పటికీ, చెప్పుకోదగ్గ దర్శకురాళ్లలో ఎక్కువగా వినిపించేపేరు విజయ నిర్మల గారు. ఇక ఆ తరువాత కొంతవరకు వినిపించే పేరు బి జయ. అయితే ఆవిడ మరెవరో కాదు, వేల సినిమాలకు పీఆర్వోగా పనిచేసి, సినిమా ప్రముఖుల మన్ననలు అందుకుంటున్న ప్రముఖ పీఆర్వో మరియు ప్రముఖ మ్యాగజైన్ అధినేత బి. ఏ. రాజు గారి భార్య. కాగా ఆమె గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జయ నిన్న అనగా ఆగష్టు 30, రాత్రి గం.9.20ని.లకు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

ఆమె దర్శకత్వం వహించిన చిత్రాలు చంటిగాడు, ప్రేమికులు, లవ్లీ, గుండమ్మ గారి మనవడు, ఇక ఇటీవల విడుదలైన వైశాఖం. మొదటినుండి ఏదో సాధించాలనే పట్టుదలతో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ మరియు సైకాలజీ డిగ్రీలు చేసిన బి. జయ, మొదట్లో ఆంధ్ర జ్యోతి పత్రికకు కొన్నాళ్ళు సంపాదకురాలిగా పని చేశారు. ఆ తరువాత సినిమాల మీద మక్కువతో తన భర్త సాయంతో టాలీవుడ్ లోకి దర్శకురాలిగా అడుగుపెట్టారు. కాగా ఆమె తీసిన చిత్రాల్లో ఆది నటించిన ‘లవ్లీ’ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఆమె మరణం నిజంగా టాలీవుడ్ కి తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరి, బి. ఏ. రాజుగారికి ఆ భగవంతుడు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు….

సంబంధిత సమాచారం :

X