అల్లు అరవింద్ సపోర్ట్ తీసుకుంటున్న ‘పేపర్ బాయ్’ !
Published on Aug 26, 2018 5:11 pm IST

దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పేపర్ బాయ్’. ఈ చిత్రం ఆగష్టు 31 విడుదల అవ్వబోతున్న విషయం తెలిసిందే. కాగా నూతన దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం కొత్త కథాంశంతో వస్తుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయని, పైగా ఈ ప్రేమ కథ మొత్తం కొత్త నేపథ్యంలో సాగుతుందని సమాచారం.

ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి నిర్మాత బాధ్యతలే కాకుండా కథ కథనం మాటలు కూడా అందించారు. ఇప్పుడు ఈ చిత్రం గీత ఆర్ట్స్‌ చేతిలోకి వెళ్లింది. అల్లు అరవింద్‌ లాంటి పెద్ద నిర్మాత ఈ చిత్రానికి సపోర్ట్ చెయ్యడంతో ఈ సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ పేపర్ బాయ్ ఎంతవరకు రీచ్ అవుతాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook