ఆ ఫ్లాప్ సినిమా గురించి ప్రస్తావించిన బండ్ల గణేష్!

Published on Aug 26, 2021 12:00 am IST

నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బండ్ల గణేష్. నిర్మాతగా రాణిస్తూనే, ప్రస్తుతం హీరోగా సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యం లో ఒక ప్రముఖ యూ ట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు బండ్ల గణేష్. ఈ ఇంటర్వ్యూ లో మరొకసారి తన సినిమాల గురించి, తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ అతిపెద్ద ఫ్యాన్ అన్న విషయం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే సినిమాలు తీసిన బండ్ల గణేష్ మరొక సినిమా తీయడానికి సైతం సిద్దం అయ్యారు. అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూ కి సంబంధించిన ఒక ప్రోమో ను బండ్ల గణేష్ షేర్ చేయడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ డ్యుయల్ రోల్ లో నటించిన తీన్ మార్ చిత్రం గురించి మాట్లాడారు. రాజకీయాలకు ముడి పెడుతూ ఇంటర్వ్యూవర్ నాగరాజు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తీన్ మార్ ప్లాప్ అంటూ చెప్పుకొచ్చారు. తీన్ మార్ తర్వాత గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం ను గుర్తు చేశారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా గురించి, పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి బండ్ల గణేష్ మరోమారు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :