ప్రొడ్యూసర్ కౌన్సెల్ ఎన్నికల ఫలితాలు: కౌన్సిల్ అధ్యక్షుడిగా కే.ఎల్ దామోదర్ ప్రసాద్

ప్రొడ్యూసర్ కౌన్సెల్ ఎన్నికల ఫలితాలు: కౌన్సిల్ అధ్యక్షుడిగా కే.ఎల్ దామోదర్ ప్రసాద్

Published on Feb 19, 2023 4:49 PM IST

తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సెల్ ఎన్నికలు ఉత్కంఠగా ముగిశాయి. దిల్ రాజు ప్యానెల్‌లోని కెఎల్ దామోదర్ ప్రసాద్ (అలా మొదలైంది నిర్మాత) ప్రస్తుత అధ్యక్షుడు, సీనియర్ నిర్మాత సి కళ్యాణ్‌ను ఓడించి అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా కొల్లా అశోక్ కుమార్, సుప్రియ యార్లగడ్డ (ఏకగ్రీవం) లు నిలవగా, సీక్రెటరీ లుగా తుమ్మల ప్రసన్నకుమార్, వై.వి.ఎస్ చౌదరి లు గెలుపొందారు. జాయింట్ సెక్రెటరీ సి.భరత్ చౌదరి, నట్టి కుమార్ గెలవగా, ట్రెజరర్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ (ఏకగ్రీవం) గా గెలిచారు.

సరికొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్

1. దిల్ రాజు
2. డి.వి.వి దానయ్య
3. స్రవంతి రవి కిషోర్
4. యలమంచిలి రవిశంకర్ (మైత్రి రవి)
5. పద్మిని
6. బెక్కం వేణుగోపాల్
7. సురేందర్ రెడ్డి
8. గోపీనాథ్ ఆచంట
9. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు)
10. పల్లె కేశవరావు
11. వి.శ్రీనివాసరావు
12. అభిషేక్ అగర్వాల్
13. తోట కృష్ణ
14. ప్రతాని రామకృష్ణ గౌడ్
15. పూసల కిషోర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు