మహానటి సినిమాను శ్రీదేవికి అంకితం చేసిన నిర్మాత !
Published on Feb 25, 2018 1:17 pm IST

నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మహానటి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు తదితర నటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

మర్చి 29న ఈ చిత్ర విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాని సినిమాలో గ్రఫిక్ష్ వర్క్ ఉండడంతో విడుదల కాస్త ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. నిన్న రాత్రి ఆకస్మిక మృతి చెందిన శ్రీదేవికి మహానటి సినిమాను అంకితం చెయ్యబోతున్నట్లు నిర్మాత అశ్వినీదత్ తెలిపార గతంలో అశ్వినిదత్ శ్రీదేవి తో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తీసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా భారి విజయం సాధించింది.

 
Like us on Facebook