కాంట్రవర్షియల్ సినిమా కంగనా వద్దకు వెళ్లలేదట

కాంట్రవర్షియల్ సినిమా కంగనా వద్దకు వెళ్లలేదట

Published on Oct 23, 2019 8:46 PM IST

Kangana Ranaut

అమలాపాల్ నటించిన ‘ఆడై’ చిత్రం అనేక కాంట్రవర్సీలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వసూళ్ల పరంగా అంతగా వర్కవుట్ కాలేదు కానీ సినిమా కోసం బట్టలు లేకుండా నటించిన అమలాపాల్ ధైర్యానికి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. అందుకే ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. రీమేక్ హక్కులు అమ్ముడవగానే అందులో కంగనా రనౌత్ నటిస్తుందనే వార్తలు మొదలయ్యాయి.

కానీ అవేవీ నిజం కాదట. ఈ విషయాన్ని హక్కుల్ని కొన్న నిర్మాత అరుణ్ పాండియన్ స్వయంగా తెలిపారు. అసలు సినిమా చేయమని కంగనా వద్దకు వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే సినిమాను హిందీలోకి రీమేక్ చేయడం ఖాయమని, త్వరలోనే కాస్ట్ అండ్ క్రూ వివరాల్ని ప్రకటిస్తామని కూడా అన్నారు. ఇకపోతే కంగనా ప్రస్తుతం ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటిస్తోంది.

తాజా వార్తలు