రవి కుమార్ సీరపు దర్శకత్వంలో మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఆగస్ట్ 21న విడుదల చేస్తోంది.
ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మాట్లాడుతూ .. ‘మా ‘రెడ్ బ్యాగ్’ చిత్రానికి ప్రేక్షకులల్లో మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటివరకు విడుదల చేసిన గ్లింప్స్, టీజర్, పాటలకు యూట్యూబ్‌లో అద్భుతమైన ఆదరణ దక్కగా, సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ మరియు స్టైలిష్ మేకింగ్‌పై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ప్రమోషనల్ కంటెంట్ కంటే చిత్రం పది రెట్లు ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఊహకందని ట్విస్టులతో చివరి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది.’
‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సహకారంతో ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తుండగా, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల సమిష్టి కృషితో రూపొందిన ‘రెడ్ బ్యాగ్’ ఖచ్చితంగా అందరినీ మెప్పిస్తుందని నమ్ముతున్నాం.’ అని అన్నారు.


