దేవర: “హుకుం” ను మర్చిపోతారు – నాగ వంశీ

దేవర: “హుకుం” ను మర్చిపోతారు – నాగ వంశీ

Published on May 16, 2024 7:06 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మే 19, 2024 న ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే ఈ సాంగ్ ను అందరికంటే ముందుగా విన్న ప్రొడ్యూసర్ నాగ వంశీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పర్ఫెక్ట్ ఆంథమ్ సాంగ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అని అన్నారు. మీ అందరి కంటే ముందు నేను పాట విన్నాను. నన్ను నమ్మండి, హుకుమ్ మర్చిపోతారు అంటూ చెప్పుకొచ్చారు. అనిరుద్ రవి చందర్ నెక్స్ట్ లెవెల్ మాస్ అని ఎలివేషన్ ఇచ్చారు. దేవర ముంగిట నువ్వెంత అనే డైలాగ్ ను కూడా తన పోస్ట్ లో చేర్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి జైలర్ చిత్రం లో ఇచ్చిన హుకుమ్ సాంగ్ చాలా ఫేమస్ అయ్యింది. మరి ఈ పాట పై అందరిలో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు