విషాదం: ప్రముఖ నిర్మాత మృతి !

విషాదం: ప్రముఖ నిర్మాత మృతి !

Published on Apr 22, 2026 10:26 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐతే, చిట్టిబాబు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కుమారుడే చిట్టిబాబు. మొదట కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఆ తర్వాత ‘సంతానం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొత్తం 12 సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా దాదాపు 30 చిత్రాల్లో తెరపై కూడా కనిపించారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పలు సినిమాలు నిర్మించారు. ఆయన మరణం పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మా 123తెలుగు.కామ్ తరఫున నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

తాజా వార్తలు