ఫ్యాన్స్ ఏమనుకున్నా అప్డేట్ మాత్రం రావడం లేదు.

Published on May 30, 2020 8:55 am IST

డార్లింగ్ ప్రభాస్ మూవీ అప్డేట్ గురించి ఎంత రచ్చ చేస్తున్నా ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏమి రావడం లేదు. 50శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయిన మూవీ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం వారిలో అసహనాన్ని పెంచేస్తుంది. ఏళ్ల తరబడి ప్రభాస్ సినిమాల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి కనీసం ఆసక్తికర అప్డేట్స్ తో వారి దాహం తీర్చడం దర్శక నిర్మాతల కనీస బాధ్యత. అలాగే ఈ విషయంలో కొంచెం సన్నద్ధతో ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా హీరో ప్రభాస్ పై ఉంది.

కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ ని ఏమనకుండా తమ అసహనం మొత్తం నిర్మాతలపై చూపిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకొని ఏదైనా ఆసక్తికర అప్డేట్ ఇస్తే వారి కోపానికి అడ్డుకట్ట వేసినవారవుతారు. ఇక ఈ సినిమాకు ఓ డియర్ అనే టైటిల్ ప్రచారం అవుతుండగా రాధా కృష్ణ పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More