‘భరత్ అనే నేను’ ప్రమోషన్ల కోసం భారీ బడ్జెట్ !

16th, April 2018 - 02:26:22 PM


భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నూతన చిత్రం ‘భరత్ అనే నేను’. మంచి బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించిన నిర్మాణ సంస్థ డివివి.ఎంటర్టైన్మెంట్స్ ప్రచారం కోసం కూడ పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తోంది. ఇందులో భాగంగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే హోర్డింగ్స్ రూపంలో ప్రచారం నిర్వహించడం కోసం రూ.3 కోట్ల రూపాయలను కేటాయించారట నిర్మాతలు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ ఎక్కువ మొత్తంలోనే జరగడంతో తొలిరోజు ఓపెనింగ్స్ రూపంలో ఎక్కువ మొత్తం వెనకొచ్చేలా చిత్రాన్ని ఎక్కువ షోల ద్వారా ప్రదర్శించనున్నారు డిస్ట్రిబ్యూటర్లు. హీరో మహేష్ బాబు కూడ రేపటి నుండి మొదలుకానున్న ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇకపోతే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పాటలకు అందించిన సంగీతం ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.