ప్రీ ప్రమోషన్స్‌తో స్పీడ్ పెంచిన ‘శివమ్’!

ప్రీ ప్రమోషన్స్‌తో స్పీడ్ పెంచిన ‘శివమ్’!

Published on Sep 11, 2015 9:00 PM IST

Shivam
రామ్ హీరోగా ‘శివమ్’ పేరుతో ఓ హై వోల్టేజ్ లవ్‌స్టోరీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈనెల 12న పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.

స్రవంతీ మూవీస్ సంస్థ సినీ పరిశ్రమలో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వస్తోన్న శివమ్ సినిమాను అన్ని విధాలా ది బెస్ట్ అనిపించేలా దర్శక నిర్మాతలు రూపొందిస్తున్నారు. ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. హీరో రామ్ ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని ఓ ఎఫ్.ఎం. చానల్‌లో సినిమాకు సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు. రామ్ సరసన రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాతో రామ్ మరో హిట్ కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు