బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పికె’. ఈ సినిమా డిసెంబర్ 19న రిలీజ్ అయ్యి ఇండియన్ సినీ ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. ఈ సినిమా ఎక్కువమంది మనసును గెలుచుకుంటే, కొంతమంది మనోభావాలను దెబ్బతీసింది. ఇప్పటికే కొంతమంది ఒక గ్రూప్ గా ఏర్పడి తమ మతాన్ని కించపరిచేలా సినిమా ఉందని, ఈ మూవీ రైటర్, డైరెక్టర్, నిర్మాత కావాలనే అలాంటి సన్నివేశాలను పెట్టారని ఆరోపణలు చేసారు. దాంతో పలు చోట్ల ఈ సినిమాని ఆపేయాలని నిరసనలు జరుగుతున్నాయి.
పికె సినిమాని ఆపేయాలనే నిరసనలు హైదరబాద్ లో కూడా జరిగాయి. ఈ రోజు అబిడ్స్ లోని రామకృష్ణ సినిమా హాల్ దగ్గర కొంతమంది ధర్నా చేసి సినిమాని ఆపేయాలని కోరారు. ప్రస్తుత సమాజంలోని వారు తమ గుర్తింపు కోసం ఇలా ఏదో ఒక అనవసరమైన కారణంతో నిరసనలు చేస్తున్నారు. సినిమాలు మరియు నటులు ఎప్పుడూ ఎవరినీ కించపరచకుండా, వాళ్ళ పవర్ ఏంటి అనేది చూపించడానికే చూస్తారు. ఇలాంటి విషయాలను నమ్మాలా.? వద్దా.? అన్నది ప్రేక్షకులే నిర్ణయించుకుంటారు..


