టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగు సినిమా దగ్గర అధిరోహించిన శిఖరాలు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అలాంటి స్టార్ కి కొడుకుగా పుట్టి ఆ లెగసీని ఏమాత్రం పక్క దారి పట్టకుండా తీసుకెళ్లడంలో తన వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే వస్తున్నాడు. ఇలా లేటెస్ట్ గా పెద్ది సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి తన వాత్సల్యాన్ని తన కొడుకు సక్సెస్ పట్ల చూపించారు.
సోషల్ మీడియాలో పెద్ది సినిమా కోసం ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తన 158వ సినిమా షూట్ కోసం పొలాచ్చిలో ఉన్నప్పటికీ తన మనసు మాత్రం రామ్ చరణ్ పెద్ది దగ్గరే ఉందని చెప్పుకొచ్చారు. “గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.” అంటూ కొనియాడారు. అలానే దర్శకుడు బుచ్చిబాబుకి కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలానే మొదటి సినిమాకి భారీ స్థాయిలో నిర్మాణం వహించిన నిర్మాత వెంకట సతీష్ కిలారుకి కంగ్రాట్స్ తెలిపారు.
వీరితో పాటుగా వెర్సటైల్ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబుల పెర్ఫామెన్స్ ల కోసం కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా పాటలు, కదిలించే నేపథ్య సంగీతం అందించిన రెహమాన్ నుంచి అద్భుతమైన కెమెరా వర్క్ ఇచ్చిన రత్నవేలు, నవీన్ నూలి ఎడిటింగ్ ఇలా అన్ని క్రాఫ్ట్స్ లో ఉన్న టెక్నీషియన్స్ ఇంకా నటీనటులు అందరికీ మెగాస్టార్ తన అభినందనలు తెలిపి రామ్ చరణ్ పై తన పుత్రోత్సాహాన్ని, పెద్ది సినిమాపై తన మార్క్ రివ్యూ అందజేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ… pic.twitter.com/gZwN99aERV
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2026


