ప్రౌడ్ మూమెంట్..ఆస్కార్ అవార్డ్ లిస్ట్ లో సూర్య సినిమా పేరు..!

Published on Feb 26, 2021 12:05 pm IST

మన దక్షిణాదిన మోస్ట్ లవబుల్ స్టార్ హీరోలలో కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య కూడా ఒకరు. అయితే సూర్యకు గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేదు అని బాధ పడిన ప్రతీ ఒక్కరికీ సుధా కొంగర సూర్య అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ తో కలిసి “ఆకాశం నీ హద్దురా”(సూరారై పొట్రు) అనే ఒక ప్రేరణాత్మక ఎమోషనల్ హిట్ ను అందించారు.

అయితే ఇది ఒక్క థియేటర్స్ లో విడుదల కాలేదు అన్న వెలితి తప్పితే ప్రతీ ఒక్క భారతీయుడిని మరియు ఇండియన్ సినిమా అభిమానిని ఎంతో గర్వపడేలా ఈ చిత్రం చేసింది. అయితే గత కొన్ని రోజుకా కితమే ఈ చిత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందిన అవార్డు ఆస్కార్స్ లో ఎంపిక కాబడింది అని వార్త బయటకు రావడంతోనే అంతా ఎంతో గర్వంగా భావించారు.

మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ ఆస్కార్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 366 ఉత్తమ చిత్రాల తుది జాబితాలో ఈ చిత్రం ఒకటే మన దేశం నుంచి స్థానాన్ని దక్కించుంది. దీనితో ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రౌడ్ మూమెంట్ కు గాను ప్రతీ ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు జల్లు వస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ జాబితాలోని విజేత చిత్రాలను వచ్చే మార్చ్ 15న ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :