‘రానా’ని చూస్తుంటే గర్వంగా ఉంది – మహేష్ బాబు

Published on Sep 9, 2018 9:25 am IST

నూతన దర్శకుడు మహా దర్శకత్వంలో రూపొందిన ‘కేరాఫ్ కంచెర పాలెం’ విడుదల అవ్వకముందే, ప్రివ్యూ షోల ద్వారా సినీ ప్రముఖుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత కూడా ప్రేక్షకులను ఇంకా ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఇంత మంచి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ పై ‘రానా దగ్గుబాటి’ సమర్పించిన విషయం తెలిసిందే.

కాగా రానా పై ఈ చిత్ర బృందంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించడం విశేషం. ‘కేరాఫ్ కంచెర పాలెం’ చూసిన తర్వాత మహేష్ తన స్పందనను ట్విటర్‌ స్వరా తెలియజేస్తూ.. ‘ ‘కేరాఫ్‌ కంచరపాలెం’ చిత్రం నిజంగా దర్శకుడి చిత్రం. ఈ చిత్రంలోని పాత్రలను దర్శకుడు అద్భుతంగా రాశాడు. ఇక క్లైమాక్స్‌ అయితే ఈ సినిమాకు గుండె లాంటిది. మొదటి సినిమానే ఇంత అత్యద్భుతంగా తెరకెక్కించిన వెంకటేష్ మహాకు నా శుభాకాంక్షలు. నాకు ఈ చిత్రం చాలా బాగా నచ్చింది. ఇంతటి మంచి నైపుణ్యం ఉన్న యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తున్న రానాని చూస్తుంటే గర్వంగా ఉంది’ అని మహేష్ పోస్ట్ చేశారు.

ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు. సుబ్బరావు, రాధా బెస్సె, కెసవ, నిత్య శ్రీ, ప్రనీథ, కార్తీక్ రత్నం, మోహన్ భగత్, పరుచురి విజయ ప్రవీణ్, కిశోర్ కుమార్ పొలిమెర తదితరులు నటించగా.. పరుచూరి విజయ ప్రవీణా నిర్మించారు.

సంబంధిత సమాచారం :