ఈ ఫార్మాట్‌లో కూడా రిలీజ్ కానున్న “పొన్నియిన్ సెల్వన్”

PS2

విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తీ, త్రిష మరియు జయం రవి ప్రధాన పాత్రలలో మణిరత్నం యొక్క రాబోయే మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తాజా వార్త ఏమిటంటే, PS2 నిర్మాతలు ప్రేక్షకులకు మంచి ఎక్స్ పీరియన్స్ ను అందించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి, ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాని IMAX మరియు 4DX ఫార్మాట్లలో విడుదల చేయాలని వారు ప్లాన్ చేసారు.

ఈరోజు ప్రీమియం EPIQ ఫార్మాట్‌లో సినిమాను కూడా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మద్రాస్ టాకీస్ సహకారంతో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Exit mobile version