పవన్ సినిమా ఫస్ట్ సింగిల్ అదిరిపోతుందట

Published on Mar 2, 2020 10:12 pm IST

పవన్ రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న కొత్త చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అచనాలున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రతి అంశం గొప్పగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిత్ర టీమ్ సైతం ఇదే ఆలోచనతో వర్క్ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే పాటలు గొప్పగా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే సిద్దమైన ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదలకానుంది.

ఈ పాట చాలా బావుంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు ఇప్పటికే చెబుతుండగా హీరో నితిన్ సైతం తాజాగా థమన్ గురించి ట్వీట్ చేస్తూ పాట చాలా
అద్భుతంగా ఉందని విన్నానని అన్నారు. నితిన్ మాటలతో పాటపై అంచనాలు మరింత పెరిగాయి. ఇకపోతే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2020 ప్రథమార్థంలోనే విడుదలకానుంది. ఈ చిత్రంతో పాటే క్రిష్ సినిమా కూడా చేస్తున్నారు పవన్. ఈ రెండూ పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రాన్ని స్టార్ట్ చేస్తారు.

సంబంధిత సమాచారం :

More