పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో క్రిష్ చిత్రం కూడ ఉంది. ఈ సినిమా చారిత్రిక నేపథ్యంలో ఉండనుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు నిర్మాత ఏ.ఎం.రత్నం. పవన్ మొదటిసారి హిస్టారికల్ సబ్జెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొని ఉంది. అసలు సినిమాలో పవన్ లుక్ ఎలా ఉండబితుందో చూడాలని చాలామంది ఆతురతగా ఉన్నారు.
వారికోసమే రేపు మహాశివరాత్రి సందర్బంగా పవన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. రేపు 11వ తేదీ సాయంత్రం 5: 19 గంటలకు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విడుదలవుతుంది. ఈ పిరియాడిక్ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటీనటులు పలువురు కీలకమైన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు నడుస్తున్నా ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు.


