ఎన్ఐటీ వరంగల్ విద్యార్థి నిర్మిస్తున్న ‘లూసీ’.. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సైకలాజికల్ థ్రిల్లర్!

Raghavendra Pujari

సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘లూసీ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. మహదేవ్ చిరంజీవి కథ, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సైన్మా స్టూడియోస్’ బ్యానర్‌పై రాఘవేంద్ర పూజారి నిర్మిస్తుండగా, ఆండాళమ్మ పిక్చర్స్ సమర్పిస్తోంది. ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవేంద్ర పూజారి, విద్యను కొనసాగిస్తూనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. చరణ్ రాజ్, శశాంక్ బాలు, ప్రశాంతి ఏడే, బల్వీర్ సింగ్, రంజిత్ నగెళ్లి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

చిత్రీకరణ పూర్తి కావడంతో ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సాంకేతిక విభాగంలో ఎంసీ ఛాయాగ్రహణంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వర్తించగా, వియాన్ సంగీతం అందించారు. ఆశిష్ పసుల, కిరణ్ పట్టేటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం నిర్మాణ అనంతర పనులు తుది దశకు చేరుకుంటుండటంతో, త్వరలోనే టీజర్, ట్రైలర్‌లతో పాటు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

Exit mobile version