‘పులి’ తెలుగు ఆడియో రిలీజ్ డేట్

‘పులి’ తెలుగు ఆడియో రిలీజ్ డేట్

Published on Aug 30, 2015 12:01 PM IST

puli
తమిళ సినీ పరిశ్రమలో ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా చెప్పబడుతోన్న సినిమా ‘పులి’. ఇలయదళపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమాపై అంతటా విపరీతమైన అంచనాలున్నాయి. సుమారు 100 కోట్లకు పైనే బడ్జెట్‌తో తెరకెక్కడం, నటి శ్రీదేవి చాలా కాలం తర్వాత సౌతిండియన్ సినిమాలో కనిపించనుండడం, విజయ్ కెరీర్లో నిలిచిపోయే సినిమాగా ప్రచారం జరుగుతూండడం లాంటి విశేషాలన్నీ ఈ సినిమాకు తమిళ నాట ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.

తెలుగులోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండడంతో ఎస్వీఆర్ మీడియా ఈ సినిమాను తెలుగులో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ 1న ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ వర్షన్‌కు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక గత నెలలో జరిగిన విషయం తెలిసిందే. కాగా తెలుగు వర్షన్ ఆడియో రిలీజ్‌ను సెప్టెంబర్ మొదటివారంలో 6 లేదా 7వ తేదీన చేపట్టనున్నారు. హైద్రాబాద్‌లో పెద్ద ఎత్తున ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సరసన శృతి హాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు చింబు దేవన్ దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు