బిగ్ బాస్ షో పై పునర్నవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బిగ్ బాస్ షో పై పునర్నవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Jun 28, 2020 11:28 PM IST

నటిగా కొన్ని సినిమాలలో నటించిన పునర్నవి బిగ్ బాస్ షో ద్వారా కొంచెం ఫేమస్ అయ్యింది. ఐతే ఈ బ్యూటీ బిగ్ బాస్ షో పై ఆసక్తికర ఆరోపణలు చేసింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన పునర్నవి బిగ్ బాస్‌ షో గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో లోపల ఎంతో జరుగుతుందని.. కానీ షో నిర్వాహకులు మాత్రం.. ఎడిట్ చేసి వాళ్లకు అవసరమైన దాన్నే బయటకు చూపిస్తారని చెప్పింది. ప్రేక్షకులు కూడా వాళ్లు చూపించేదే నిజమనే భ్రమలో ఉంటారని చెప్పుకొచ్చింది. అలాగే షోలో ఎలాగున్నా.. బయటకొచ్చిన తర్వాత మాత్రం తనతో హౌస్‌లో ఉన్న అందరితోనూ టచ్‌లో ఉన్నట్టు తెలిపింది పునర్నవి.

కాగా ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ కానుంది. కరోనా కారణంగా ఇంకా ఈ షో మొదలు కాలేదు కానీ.. ఈ షోకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నట్లు సమాచారం. అలాగే బిగ్‌బాస్ సీజన్ 4కి యంగ్ హీరో విజయ దేవరకొండ లేదా అక్కినేని వారి కోడలు సమంత గానీ హోస్ట్‌గా ఉండబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి సీజన్‌ 4లో ఎవరు ఉంటారు? ఎవరు బిగ్‌బాస్ సీజన్ 4 నిర్వహించబోతున్నారో తెలియాలంటే కొద్దిరోజులు ఎదురు చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు