
పూరి – ఛార్మీ కాంబినేషన్ లో వస్తున్న జ్యోతిలక్ష్మి సినిమా విడుదల దగ్గర పడుతున్న తరుణంలో సినిమా ప్రచారంపై చిత్ర బృందం దృష్టిపెడుతున్నారు. ఈ సినిమా ఆడియో ఇప్పటికే విడుదలై శ్రోతలకు చేరువైంది. జూన్ 12న మనముందుకు రానుంది.
ప్రస్తుతం చిత్ర ప్రమోషన్లను అధిక మోతాదులో జరుపుతున్న దర్శకుడు తానేకాక ఛార్మీచేత కూడా పలు చానళ్ళలో ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా వున్నాడు. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సి.కె ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ శుభ శ్వేతా ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించారు.

