మాస్ యాంగిల్ ను సరికొత్తగా ప్రెజెంట్ చెయ్యడంలో దర్శకుడు పూరి జగన్నాథ్ దిట్ట. అలాగే అప్పటి వరకు ఒకలా ఉన్న హీరోని తన సినిమాతో పూర్తిగా డిఫరెంట్ గా చూపించి పూరి సరికొత్త బ్రేక్ ఇస్తాడు. అలాంటి పూరి ఒక స్టార్ హీరోతో ఒక ప్రాజెక్ట్ ను చేపట్టాడంటే దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది.
అలా పూరి ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తాడన్న వార్త కొన్నాళ్ల కితం మన దక్షిణాదిలో సంచలనం రేపింది, ఆ స్టార్ హీరోనే “యష్”. కేజీయఫ్ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో ఆ ఒక్క సినిమాతో తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి ఆదరణను అందుకున్న ఈ హీరోతో పూరి ఒక ప్రాజెక్ట్ ను చేయనున్నారని టాక్ విపరీతంగా వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే.
అయితే ఆ టైం లో వెలుగులోకి వచ్చిన ఈ వార్తలు నిజమే అన్నట్టు మరోసారి సారి సంకేతాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో సినిమా పక్కకి పోలేదని లైన్ లోనే ఉన్నట్టు ఇపుడు టాక్. అన్ని సెట్టయ్యాక ఈ కాంబో పట్టాలెక్కనుంది తెలుస్తుంది. ఇపుడు మాస్ లో ఈ ఇద్దరికీ సరైన ఫాలోయింగ్ ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండనుందో చూడాలి.


