ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్లో పూరి నెక్స్ట్ సినిమా !

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరితో ఒక సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు తన పుట్టినరోజు సందర్బంగా పూరి ఈ చిత్రాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అంతేగాక సినిమా ఎలా ఉండబోతోందో కూడా వివరించారు. ‘సినిమా స్క్రిప్ట్ పూర్తయింది. ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీ. 1971 ఇండో-పాక్ యుద్ధం నైపథ్యంలో సాగే సినిమా. ఇది నా తరహా సినిమాలకి పూర్తి భిన్నమైంది’ అన్నారు.

అలాగే ‘నా కొడుక్కి సినిమాల పట్ల ఉన్న తపనే నా చేత ఈ సినిమాను చేయిస్తోంది. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది’ అన్నారు. అక్టోబర్లో రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి సందీప్ చౌత సంగీతాన్ని అందిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ వంటి లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి జగన్ టూరింగ్ టాకీస్ పై నిర్మితంకానున్న ఈ చిత్రానికి ‘మెహబూబా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.