పూరి పాన్ ఇండియా మూవీలో యాక్షన్ అండ్ ఎమోషన్స్ ఓ రేంజ్ లో

Published on Feb 29, 2020 8:13 am IST

దర్శకుడు పూరి జగన్నాధ్ మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. విజయ దేవరకొండ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు మరియు హిందీతో పాటు పలు సౌత్ లాంగ్వేజ్ లలో విడుదలకానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రంలో పూరి విజయ్ దేవరకొండను ప్రొఫెషనల్ ఫైటర్ గా చూపిస్తుండగా కిక్ బాక్సింగ్ సన్నివేశాలతో పాటు యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుందట. అలాగే రవితేజ హీరోగా పూరి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా వలే మదర్ సెంటిమెంట్ కూడా ఎక్కువగానే ఉంటుందని వస్తున్న సమాచారం.

విజయ్ దేవరకొండ 10వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి నిర్మిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ను తీసుకోవడం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :