చిరు 150 సినిమాపై పూరీ ఆసక్తికర కామెంట్స్!

చిరు 150 సినిమాపై పూరీ ఆసక్తికర కామెంట్స్!

Published on Oct 1, 2015 9:21 AM IST

chiru-puri
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ విషయం ఇప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, చిరు 150వ సినిమాకు దర్శకత్వం వహిస్తారని ప్రకటించడం, స్క్రిప్ట్ కూడా పూర్తయిన తర్వాత ఆ స్క్రిప్ట్ నచ్చక చిరు ఈ సినిమాను పక్కనపెట్టడంతో చిరంజీవి 150వ సినిమా కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా ఎవరితో ఉంటుందీ? అనే విషయమై జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.

కాగా ఇదే విషయమై మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేయడం విశేషంగా కనిపిస్తోంది. “చిరంజీవి గారి 150వ సినిమా చేయడానికి అందరికంటే నాకే ఎక్కువ హక్కు ఉందని నా నమ్మకం. ఎందుకంటే అందరికన్నా నేనే ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని. ఆయన తెరమీద ఎలా ఉంటే బాగుంటుందో ఫ్యాన్స్‌కే తెలుసు. ఆయనకు కూడా తెలీదు. ఈ కథ కుదరకపోతే ఇంకో కథ చేస్తా.. అదీ కుదరకపోతే ఆయనకు నచ్చేంతవరకూ చేస్తా. 150 నేనే చేస్తా. లేదంటే 151 చేస్తా. ఎప్పటికైనా చిరంజీవి గారితో సినిమా చేయాలన్నదే నా కోరిక” అంటూ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ఇక చిరుతో సినిమా ఆగిపోయాక, పూరీ ఇలా చిరంజీవి 150వ సినిమా చేసే హక్కు తనకే ఎక్కువుందని తెలపడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరి ఇలాంటి పరిణామాలున్న నేపథ్యంలో చిరు 150వ సినిమా చివరకు ఎవరికి దక్కుతుందనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇదిలా ఉంటే చిరు, రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న బ్రూస్‌లీలో చిన్న గెస్ట్ రోల్ ద్వారా మెప్పించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు