రెండు ఖరీదైన కార్లను కొన్న పూరి, ఛార్మి

Published on Sep 17, 2019 1:42 am IST

ఛాన్నాళ్ల తర్వాత పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ విజయం ఆయనకు ఆర్థికంగా కూడా మంచి బలాన్నిచ్చింది. ఎందుకంటే చిత్ర నిర్మాత ఆయనే కాబట్టి. ఆయనతో పాటే ఛార్మికి సైతం నిర్మాణంలో భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఆమెకు కూడా కలిసొచ్చింది.

అందుకే ఇద్దరూ ఖరీదైన స్టైలిష్ కార్లను కొన్నారు. పూరి జగన్నాథ్ రేంజ్ రోవర్ వోగ్ కారును కొనుగోలు చేస్తే ఛార్మి కూడా దగ్గర దగ్గర అదే స్థాయిలో బిఎంఎమ్ డెబ్ల్యూ 7 సిరీస్ వాహనాన్ని కొనేసింది. మొత్తం మీద ఇద్దరు నిర్మాతలు విజయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం పూరి నిర్మాణ సంస్థ ఆకాశ్ పూరి హీరోగా ‘రొమాంటిక్’, విజయ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ అనే సినిమాల్ని నిర్మిస్తోంది. వీటిలో దేవరకొండ సినిమాను పూరి స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More