యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. నేటి నుంచి ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాకి నేనోరకం అనే టైటిల్ ని ఈ చిత్ర వర్గాలు అనుకుంటున్నట్లు చాలా రోజుల నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమాకి నేనోరకం అనే టైటిల్ పెట్టలేదని పూరి జగన్నాధ్ క్లారిటీ ఇచ్చాడు.
ఎన్.టి.ఆర్ సినిమాకి నేనోరకం అనే టైటిల్ ని అనుకోవడం లేదు, ఇంకా టైటిల్ పై వర్క్ చెయ్యలేదని పూరి తెలిపాడు. దీంతో ఇన్ని రోజులుగా వస్తున్నా ఈ టైటిల్ రూమర్స్ కి ఎండ్ పడింది. మామూలుగానే పూరి జగన్నాధ్ తన సినిమాలకు పెట్టే టైటిల్స్ అన్నీ బాగా కాచీగా ఉంటాయి. మరి ఈసారి ఎన్.టి.ఆర్ కి ఎలాంటి టైటిల్ ఇస్తాడో చూడాలి.
ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్నాడు.


