పూరి కూడా కరోనా బ్రేక్ ఇచ్చాడు

Published on Mar 17, 2020 1:16 pm IST

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో చేస్తున్న మూవీ షూటింగ్ కి కరోనా వైరస్ కారణంగా బ్రేక్ ఇచ్చాడు. తన షూటింగ్ షెడ్యూల్స్ మరియు ఇతర ఆక్టివిటీస్ కి టెంపరరీ బ్రేక్ ఇస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పూరి మరియు నటి ఛార్మి కొన్నాళ్లుగా పూరి కనెక్ట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ నడుపుతున్నారు. ఈ బ్యానర్ లోనే విజయ్ దేవరకొండ మూవీ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ కి బ్రేక్ ఇస్తున్నట్లు వాళ్ళు ప్రకటించడం జరిగింది. అలాగే కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.

ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపిస్తుండగా, అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. హిందీ, తెలుగు మరియు తమిళ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More