వరుణ్ తేజ్ సినిమాను కన్ఫర్మ్ చేసిన పూరి.

వరుణ్ తేజ్ సినిమాను కన్ఫర్మ్ చేసిన పూరి.

Published on Jan 19, 2015 3:59 PM IST

varun-tej
నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలి సినిమాకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాల్సింది, అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ‘ముకుంద’ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా పరిచయమయ్యాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తానని వరుణ్ తేజ్ ‘ముకుంద’ విడుదల సమయంలో చెప్పారు. నేడు, వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా వివరాలను వెల్లడించారు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించబోయే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తారు. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పణలో శ్రీ శుభ శ్వేతా ఫిల్మ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ సినిమా రూపొందనుంది. హీరో వరుణ్ తేజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫోటోను పూరి జగన్నాధ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నీతో పని చేయడానికి ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు