పూరీ – కళ్యాణ్ రామ్ సినిమా సెట్స్‌పైకెళ్ళింది!

పూరీ – కళ్యాణ్ రామ్ సినిమా సెట్స్‌పైకెళ్ళింది!

Published on May 26, 2016 1:32 PM IST

puri-kalyanram
‘పటాస్’ సినిమాతో హీరోగా వచ్చిన కమర్షియల్ స్టేటస్‌ను ఆ తర్వాత వచ్చిన ‘షేర్‌’తో అందుకోలేకపోయిన కళ్యాణ్ రామ్, తాజాగా పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమాకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. కెరీర్లో ఇప్పటివరకూ పూరీ స్థాయి డైరెక్టర్‌తో పనిచేయని కళ్యాణ్ రామ్, ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇప్పటికే అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు సెట్స్‌పైకి వెళ్ళింది. హైద్రాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్‍ను నేడు ప్రారంభించారు.

పూరీ సినిమా అంటే హీరో క్యారెక్టరైజేషన్‌లో ఎప్పుడూ కొత్తదనం చూపిస్తుంటారు. అదేవిధంగా కళ్యాణ్ రామ్ సినిమా కోసం పూరీ ఓ పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఆయన గతంలో ఎప్పుడూ చేయనంత కొత్తగా ఉండనుందట. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు