‘మెహబూబా’ని చూస్తే ఎవరో కొత్తవాడు తీశాడనిపిస్తుంది – పూరి

‘మెహబూబా’ని చూస్తే ఎవరో కొత్తవాడు తీశాడనిపిస్తుంది – పూరి

Published on May 7, 2018 2:19 PM IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మెహబూబ’. ఈ సినిమాతో పూరి తనలోని కొత్త కోణాన్ని చూపిస్తానని అంటున్నారు. ఇది పూర్వ జన్మల నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని పాత్రలు, టేకింగ్ చూస్తే నా పాత పద్దతి కనిపించదు, ఎవరో కొత్తవాడు తీశాడేమో అన్నట్టు ఉంటుంది. నా గత సినిమాలకి దీనికి అస్సలు పోలిక ఉండదు అన్నారు.

మరి పూరి తన రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా సినిమాలో కొత్తదనం ఏం చూపారో తెలియాలంటే 11వరకు ఆగాల్సిందే. పూరి కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా నిర్మించగా చిత్ర ప్రపంచవ్యాప్త విడుదల హక్కుల్ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. సందీప్ చౌత సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయకిగా కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు