డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసే క్రమంలో మరో సరికొత్త టాపిక్ తో వచ్చారు. టాపిక్ పేరు ‘ డిప్రెషన్’. మరి పూరి మాటల్లోనే ‘ డిప్రెషన్’ గురించి విందాం. పూరి మాటల్లో.. ‘డిప్రెషన్ మంచిది కాదని మనందరికీ తెలుసు. అయినా ఏదో సమయంలో అందరం డిప్రెషన్ కి గురవుతాం. అయితే, ఇలా డిప్రెస్ అయి కూర్చోవడం వల్ల, మీకు మంచి జరుగుతుందని తెలుసా ?, అవును.. కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. డిప్రెషన్ వల్ల మనం స్లో డౌన్ అయిపోతాం.
ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ లో ఇలాంటి పాజ్ మనకి మంచిది, ఎందుకంటే ఆ సమయంలోనే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారు. మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటారు. దాంతో, మీ తప్పులు మీకు అర్థం అవుతాయి. మీకు ఇంకో విషయం తెలుసా ?, డిప్రెషన్ కి గురైనవాళ్ళు బాధను చాలా బాగా అర్థం చేసుకుంటారు. అప్పుడు మీలో ఎంపతీ పెరుగుతుంది. మీ రిలేషన్స్ బెటర్ అవుతాయి. కానీ, డిప్రెషన్ వల్ల వచ్చే బాధ తక్కువగా ఉంటే అది యూజ్ ఫుల్ సిగ్నల్. మరీ సివియర్ గా ఉంటే అది హానికరం. ఆ బ్యాలెన్స్ మనమే మెయింటైన్ చేయాలి. డిప్రెషన్ ని పర్పస్ ఫుల్ గా వాడుకోవడం నేర్చుకోవాలి’ అని పూరి చెప్పుకొచ్చాడు.


