టీజర్ టాక్ : పూరి మార్క్ టేకింగ్.. సేతుపతి పీక్ పెర్ఫార్మన్స్..!

టీజర్ టాక్ : పూరి మార్క్ టేకింగ్.. సేతుపతి పీక్ పెర్ఫార్మన్స్..!

Published on Jun 8, 2026 7:35 PM IST

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలయికలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. పూరి జగన్నాథ్ మార్క్ మేకింగ్‌తో పాటు ఇందులో మునుపెన్నడూ చూడని రీతిలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టీజర్ హింట్ ఇస్తోంది.

​ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఒక అంధుడైన భిక్షగాడు పాత్రలో కనిపిస్తున్నాడు. తమ జీవితాలను నాశనం చేయాలని చూసే విలన్లపై ఆయన తిరగబడే కథాంశంతో సినిమా రూపొందింది. వేరే దారి లేక, ప్రాణాలను కాపాడుకోవడానికి హీరో తుపాకులు పట్టి శత్రువులను ఊచకోత కోసే సీన్స్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. పాటలు, యాక్షన్ కట్స్‌ను మిక్స్ చేస్తూ పూరి ఈ టీజర్‌ను చాలా విభిన్నంగా డిజైన్ చేశాడు.

​పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు, సంయుక్త, దునియా విజయ్, బ్రహ్మాజీ, విటివి గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ యాక్షన్ డ్రామాకు సంగీతం అందిస్తున్నాడు. పూరి జగన్నాథ్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు