
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కన్నడలో ఓ సినిమా చేయనున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేసే బాధ్యతను పూరీ తీసుకున్నారు. కన్నడలో ‘యువరాజా’, ‘అప్పు ‘ లాంటి చిత్రాలతో అక్కడి ప్రేక్షకులకు కూడా పూరీ బాగానే పరిచయం. తన సినిమాతో భారీ అంచనాలున్న వారసుల సినిమాలను పరిచయం చేయడం పూరీకి కొత్తేమీ కాదు. గతంలో అప్పు చిత్రం ద్వారా పునీత్ రాజ్‌కుమార్‌ను, చిరుత ద్వారా రాం చరణ్‌ను పరిచయం చేసిన అనుభవం పూరీకి ఉంది.
ఇక ఇప్పుడీ తాజా చిత్రం ద్వారా నిఖిల్‌ను పరిచయం చేయనున్నారు. ఇదే విషయాన్ని పూరీ తెలియజేస్తూ, తన సినిమా ద్వారా నిఖిల్‌ను పరిచయం చేయనున్న సంగతి తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో పూరీ బిజీగా ఉన్నారు. ఇక పూరీ దర్శకత్వం వహిస్తున్న జ్యోతిలక్ష్మి అతి తక్కువ కాలంలో పూర్తి చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తవ్వగానే నిఖిల్ సినిమాపై పూరి పనిచేస్తారు. తెలుగు, కన్నడ భాషల్లో నిర్మితమయ్యే ఈ సినిమాను ఆగష్టులో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.