
చాలా రోజుల నుంచి సినిమాల్లో కొంచం స్లో అయ్యి అనవసర సమస్యల్లో చిక్కుకొని పైకి లేచిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మెహబూబా సినిమాతో అటు సోషల్ మీడియాలో ఇటు చిత్ర పరిశ్రమలో మంచి బజ్ క్రియేట్ చేసుకున్నాడు. తన కొడుకుతో కథను మలుపులు తిప్పుతూ సినిమాను ఎలా చిత్రీకత్రించాడో అదే లెవెల్ లో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో చాలా వేగవంతంగా ముందుకు దూసుకుపోతున్నాడు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యులో పూరీ జగన్ మాట్లాడుతూ ఆకాష్ మెహబూబా సినిమాకు చాలా కష్టపడ్డాడని, సినిమాలో ప్రతీ సీన్లో తన పర్ఫామెన్స్ ఆదరగోట్టాడని అన్నాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే మరో కొత్త కథతో మళ్ళీ ఆకాశ్ ని పెట్టి ఇంకో సినిమా తీస్తానని పూరీ అన్నాడు. ఇప్పటికే దానికి సంబంధించి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాని త్వరలోనే రివీల్ చేస్తానని అన్నాడు. ప్రస్తుతం మెహబూబా చిత్ర ప్రమోషన్స్ లో పూరీ ఆకాశ్ బిసీగా ఉన్నారు.