రామ్ తో పాన్ ఇండియా మూవీ ?

Published on Feb 28, 2021 7:35 pm IST

డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ మూవీ ఇద్దరికీ భారీ విజయాన్ని అందించింది. నిజానికి గత కొన్ని సినిమాలుగా పూరికి సరైన హిట్ లేకపోవడం, పైగా పూరి పడిపోయి ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ సూపర్ హిట్ రావడంతో రామ్ కి, పూరికి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే, వీరిద్దరి కలయికలో మళ్ళీ మరో సినిమా రాబోతుంది. కాకపోతే మరో ఏడాది సమయం పడుతుందట.

కాగా ప్రస్తుతం పూరి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్ అంటూ గ్యాంగ్ స్టర్ డ్రామాతో మళ్లీ ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడట. అనన్య హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి, ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అవ్వగానే రామ్ తో పూరి ఒక పాన్ ఇండియా మూవీని చేస్తాడట.

సంబంధిత సమాచారం :