సూపర్ స్టార్ మహేష్ బాబుతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించడానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడు. మహేష్ బాబుకి గతంలో పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ని అందించింది పూరి జగన్నాధే
కొన్ని సంవత్సరాల క్రితం వీరి కాంబినేషన్ లో ‘బిజినెస్ మెన్’ కూడా హిట్ అయ్యింది. ఇప్పుడు వీరిద్దరు కలిసి వచ్చే ఏడాది మరో సినిమాలో నటించనున్నారు. పూరి త్వరలో మహేష్ బాబుకి స్క్రిప్ట్ చెప్పనున్నాడు
అన్నీ సజావుగా సాగితే కొరటాల శివ సినిమా తరువాత చిత్రం మొదలవుతుంది. మరి పూరి మహేష్ లు ముచ్చటగా మూడోసారి హిట్ ఇవ్వనున్నారా?


