పూరీ జగన్నాధ్ కు హీరో దొరుకుతాడా ?

పూరీ జగన్నాధ్ కు హీరో దొరుకుతాడా ?

Published on Jun 25, 2018 4:16 PM IST

puri

‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్లో నంబర్ 1 డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగారు పూరీ జగన్నాథ్. అయితే ఇది అంత గతం కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక బాగా వెనుకబడిపోయారు పూరీ ఇటీవల తన కొడుకును హీరో గా పరిచయం చేస్తూ మెహబూబా సినిమా చేశారు . ఈ సినిమా కూడా ఆయనకు విజయాన్ని అందించలేకపోయింది ప్రస్తుతం ఆయన తో సినిమాలు చేయడానికి పెద్ద హీరోలు ఎవరు సుముఖత చూపడం లేదని సమాచారం .

అయితే బాలకృష్ణ పైసా వసూల్ తీసిన సమయంలో పూరీతో మరొక సినిమా చేస్తా అని ప్రకటించాడు అయితే ఆ సినిమా విడుదలై పరాజయం చెందడంతో ఇప్పుడు ఆయన మళ్ళి పూరీ ని నమ్మి ఛాన్స్ ఇచ్చే సాహసం చేయడం లేదు . ప్రస్తుతం చేతి నిండా కథలు వున్నా పూరి హీరో కోసం వెతుక్కోవలిసిన పరిస్థితి వచ్చింది . పూరీ ఆ మధ్యన నాని తో సినిమా చేయనున్నాడని టాక్ వచ్చింది. అయితే ఈ విషయం ఫై నాని స్పందించి ఆయనతో సినిమా చేయట్లేదని అన్నాడు అయితే ఇప్పుడు మళ్ళి తన కొడుకు తోనే సినిమా చేసి హిట్ కొట్టాలని భావిస్తున్నాడట ఈ దర్శకుడు .

puri jagannadh searching for heros

సంబంధిత సమాచారం

తాజా వార్తలు