డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈనెల 28న పుట్టిన రోజు జరుపుకోనున్నారు. 1966లో జన్మించిన పూరి జగన్నాధ్ ఈ ఏడాది 53వ వసంతంలోకి అడుగిడనున్నాడు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అందుకుంది. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మాతగా విడుదలైన ఈ చిత్రం 75కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మాస్ బీట్స్ ఈ మూవీ విజయంలో కీలకపాత్ర పోషించాయి.
ఐతే పూరి తన పుట్టిన రోజు సందర్భంగా ఓ క్రేజీ న్యూస్ పంచుకోనున్నారట. పూరి చేయనున్న నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఆరోజు అభిమానులకు చెప్పనున్నాడని సమాచారం. పూరి తన తదుపరి చిత్రంగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. కాగా మరి ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ లేదా ఫస్ట్ లుక్ లాంటిది ఏమైనా విడుదల చేస్తారేమో చూడాలి.


