టాక్ అఫ్ ది టౌన్ గా మారుతున్న పూరి ఆఫీసు

టాక్ అఫ్ ది టౌన్ గా మారుతున్న పూరి ఆఫీసు

Published on Jul 26, 2014 1:45 PM IST

Puri-Cave

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా రోజులగా ఇష్టపడి కట్టుకున్న ఆఫీసుని ఇటీవలే ఓపెన్ చేసారు. బాగా ఖర్చు పెట్టి ఈ ఆఫీసుని కట్టించుకున్నాడు. ఈ ఆఫీసు బిల్డింగ్ మరియు ఇంటీరియర్స్ కోసం పూరి సుమారు 20 కోట్లు కర్చు చేసాడు.

తన ఆఫీసు గురించి పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ‘ నా గురించే ఈ హోం స్టూడియోని నిర్మించాను. ఈ స్టూడియోని గత ఆదివారం ఓపెన్ చేసాను. అలాగే నా ఫ్రెండ్స్ కి చిన్న పార్టీ ఇచ్చాను. ఇది నా పర్సనల్ ప్లేస్. సుమారు ఒక సంవత్సరం రోజుల పాటు దీనిని నిర్మించారు. దీని నేను మా ఇల్లు, ఆఫీసు, రిసార్ట్, అని ఎలా కావాలంటే అలా నా కేవ్ ని పిలుచుకుంటాను. ఎందుకంటే ఈ ప్రపంచం ఒక అడవి అందులో ప్రతి ఒక్కరికీ తన గుహ ఉండాలిగా అని’ అన్నాడు. 18000 చదరపు అడుగుల్లో ఉండే ఈ కేవ్ లో పూరి జగన్నాధ్ ఒక మినీ థియేటర్ ని మరియు ఒక బార్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు