‘పురుష:’ నుంచి వెన్నెల కిషోర్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల

‘పురుష:’ నుంచి వెన్నెల కిషోర్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల

Published on Jan 22, 2026 7:00 AM IST

1 12

వివాహ బంధంలోని వాస్తవ పరిస్థితులను వినోదాత్మకంగా చూపిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నారు. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం తాజాగా ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో వెన్నెల కిషోర్ అయోమయంగా కనిపిస్తుండగా, ‘కిటికీ దగ్గర ఏం జరిగింది?’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ ప్రేక్షకులలో నవ్వులు పూయిస్తోంది. పెళ్లి తర్వాత పురుషులు పడే పాట్లను, జీవితంలో భార్య ప్రాముఖ్యతను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.
సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. సప్తగిరి, రాజీవ్ కనకాల, వి.టి.వి. గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

తాజా వార్తలు